అది నోలన్ సినిమా.. ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్స్ విడుదల

the odyssey

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అందులోని మన ఇండియన్ సినిమా ఆడియెన్స్ కి బాగా తెలిసిన దర్శకుల్లో క్రిస్టోఫర్ నోలన్ కూడా ఒకరు. తన మార్క్ మైండ్ బెండింగ్ సినిమాలతో ఒక ఊహించని ఎక్స్ పీరియన్స్ ని అందించి మంచి పేరు తెచ్చుకున్న ఈ దర్శకుడు చేసే ప్రతీ మూవ్ ఆశ్చర్యపరుస్తుంది. సరిగా మళ్ళీ అలాంటి మూవ్ వరల్డ్ వైడ్ గా అటెన్షన్ అందుకుంది.

నోలన్ ఎలాంటి భారీ సినిమా అయినా కూడా చాలా సహజంగా నిర్ణీత కాలంలోనే కంప్లీట్ చేసేస్తారు. ఇలా తాను చేస్తున్న అవైటెడ్ చిత్రమే “ఒడిస్సి”. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మరో క్రేజీ న్యూస్ ఇపుడు బయటకి వచ్చింది.

ఏదైనా సినిమాకి మహా అయితే నెల రెండు నెలలు లేదా మూడు నెలలకి ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. కానీ నోలన్ సినిమాకి మాత్రం ఏకంగా సరిగ్గా ఏడాదికి ముందే టికెట్ బుకింగ్స్ మొదలు కావడం విశేషం. ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ఐమ్యాక్స్ 70 ఎంఎం వెర్షన్ లోనే తెరకెక్కిస్తున్నారు.

దీనికి ఐమ్యాక్స్ వారు నేడే బుకింగ్స్ ని ఓపెన్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. దీనితో నోలన్ సినిమాకి ఉన్న క్రేజ్ ముఖ్యంగా ఐమ్యాక్స్ వెర్షన్ కి ఉన్న క్రేజ్ అని చెప్పొచ్చు. ఇక ఈ అవైటెడ్ సినిమా వచ్చే ఏడాది జూలై 17న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మరి దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Exit mobile version