వరల్డ్ వైడ్ ఓటిటి కంటెంట్ లో సెన్సేషనల్ హిట్టయ్యిన పలు క్రేజీ వెబ్ సిరీస్ లలో గ్లోబల్ సెన్సేషన్ “స్ట్రేంజర్ థింగ్స్” కూడా ఒకటి. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో భారీ క్రేజ్ ఉన్న కొన్ని వెబ్ సిరీస్ లలో ఇది కూడా ఒకటి. అయితే దీనికి ఫైనల్ సీజన్ గా “స్ట్రేంజర్ థింగ్స్ 5” ఇప్పుడు రాబోతుంది. దీనిపై అంచనాలు అయితే ఊహించని లెవెల్లో ఉన్నాయి.
వాటికి తగ్గట్టుగా మేకర్స్ వదిలిన లేటెస్ట్ టీజర్ ఈ సిరీస్ ముగింపుపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సిరీస్ లవర్స్ కి అయితే ఈ ట్రైలర్ ఒక బ్లాస్ట్ అని చెప్పొచ్చు. ఎల్ అండ్ తన ఫ్రెండ్స్ గ్యాంగ్ అలాగే ఫ్యామిలీ మొత్తం కూడా వెక్నాతో యుద్ధం చేసే ఇందులో యువ నటీనటుల ఫ్రెండ్షిప్ ముఖ్యంగా విజువల్స్ ఊహాతీతంగా కనిపిస్తున్నాయి.
దీనితో ఈ టీజర్ తర్వాత మాత్రం అంచనాలు మరింత పెరగడమే కాకుండా ఈ సీజన్ కి ఒక పర్ఫెక్ట్ ముగింపుగా కూడా నిలుస్తుంది అనిపిస్తుంది. అయితే ఈ ఫైనల్ సీజన్ ని నెట్ ఫ్లిక్స్ వారు మొత్తం మూడు వాల్యూమ్స్ గా తీసుకొస్తున్నారు. నవంబర్ 27న పార్ట్ 1, డిసెంబర్ 26న పార్ట్ 3 అలాగే జనవరి 1న ఫైనల్ ఎపిసోడ్ తో ముగించనున్నారు. మరి ఈ క్రేజీ సిరీస్ ఎలాంటి ట్రీట్ ఇస్తుందో తెలియాలి అంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.