‘ఓజి’ ఆగేది లేదు.. రిలీజ్ పై నిర్మాత సాలిడ్ క్లారిటీ!

OG

టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న చిత్రాల్లో అత్యధిక అంచనాలు ఉన్న సినిమా “ఓజి”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ భారీ ప్రాజెక్ట్ విడుదల తేదీ ఆల్రెడీ సెట్ చేసుకొని సిద్ధంగా ఉంది.

అయితే ఈ రిలీజ్ డేట్ పై వస్తున్న ఊహాగానాలపై నిర్మాత డీవీవీ దానయ్య లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చేసారు. డీవీవీ దానయ్య ఇటీవల మాట్లాడుతూ ఓజి సినిమా చెప్పిన డేట్ సెప్టెంబర్ 25నే వస్తుంది అని కన్ఫర్మ్ చేసేసారు. అయితే ఇదే డేట్ లో బాలయ్య భారీ చిత్రం అఖండ 2 ఉండేసరికి క్లాష్ ఉంటుంది ఏదొక సినిమా తప్పుకోవాలి అని అనుకున్నారు చాలా మంది.

కానీ ఈ క్లాష్ అద్న వాయిదాల విషయంలో తమ ఓజి మాత్రం వెనక్కి వెళ్లడం లేదు అని క్లారిటీ ఇచ్చేసారు. సో అనుకున్న సమయానికే ఓజి బ్లాస్ట్ ఉంటుంది. ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version