‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫై మరో ట్విస్ట్!

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లాంగ్ అవైటెడ్ సినిమానే “హరిహర వీరమల్లు”. పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాని దర్శకులు క్రిష్ ఆలాగే జ్యోతికృష్ణ రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాకి పడినంత బ్రేక్స్ మరో సినిమాకి పడలేదని చెప్పొచ్చు.

ఇలా ఫైనల్ గా థియేటర్స్ లో బ్లాస్ట్ అయ్యేందుకు వస్తున్న సినిమాకి ముందు గ్రాండ్ ప్రీరేలసే ఈవెంట్ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే మీదట అవుట్ డోర్ లో భారీగా ప్లాన్ చేద్దామనుకున్న ఈవెంట్ తిరుపతి నుంచి విశాఖకు చేరుకుంది.

కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు చోట్ల కూడా కాదు హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించనున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ సినిమా రిలీజ్ కి ముందే ఇన్ని టర్న్ లు తీసుకోవాల్సి వస్తుందని చెప్పాలి. ఇక థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version