రీసెంట్ గా హాలీవుడ్ నుంచి వచ్చిన భారీ చిత్రాలే “జురాసిక్ వరల్డ్ – రీబర్త్” అలాగే “సూపర్ మ్యాన్”. అయితే చాలా కాలం తర్వాత మంచి విజువల్ ట్రీట్ ని కోరుకుంటున్న ఆడియెన్స్ కి ఈ రెండు సినిమాలు ట్రీట్ ఇచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యాయి.
మరి ఇండియాలో కూడా రీజనల్ భాషల్లో విడుదల అయ్యిన ఈ ప్రముఖ ఫ్రాంచైజ్ బ్రాంచ్ సినిమాలు వసూళ్లు మాత్రం రీజనల్ గా పెద్దగా చెప్పుకునే రేంజ్ లో లేవని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర రెండు సినిమాలకి కూడా అంత సూపర్ పాజిటివ్ టాక్ ఆడియెన్స్ నుంచి రాలేదు. సూపర్ మ్యాన్ అయినా ఓకే కానీ జురాసిక్ వరల్డ్ కి మాత్రం బాగా దెబ్బ పడింది.
ముఖ్యంగా తెలుగు వసూళ్లు ఇప్పుడు వరకు జురాసిక్ వరల్డ్ కి 9 కోట్లకి పైగా గ్రాస్ వస్తే సూపర్ మ్యాన్ ఓ వారం గ్యాప్ తర్వాత విడుదల అయినప్పటికీ 6 కోట్లు అందుకుంది. ఇలా మంచి ఫేమస్ ఫ్రాంచైజ్ లు అయినప్పటికీ తెలుగులో మాత్రం ఊహించని రీతిలో వసూళ్లు ఈ చిత్రాలు అందుకోలేకపోతున్నాయి.