అనుపమ సినిమాకి తెలుగులో థియేటర్స్ లేవా?

anupama

టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యి కెరీర్ ఆరంభంలో మంచి ఫేమ్ అందుకున్న అతికొద్ది మంది హీరోయిన్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. తెలుగులో మంచి ముద్ర వేసుకున్న యంగ్ హీరోయిన్ సినిమాకి ఇపుడు తెలుగులో థియేటర్స్ లేవా అనే పరిస్థితి నెలకొందా?

అయితే అనుపమ రీసెంట్ గా నటించిన కాంట్రవర్సియల్ సినిమానే “జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ”. శంకర్ “ఐ” సినిమా విలన్ సురేష్ గోపి నటించిన ఈ సినిమా మళయాళంతో పాటుగా తెలుగు రిలీజ్ కూడా అనౌన్స్ చేశారు. అంతెందుకు ఇవాళ రిలీజ్ అంటే నిన్నటి పోస్టర్ లో కూడా తెలుగు భాష కూడా ఉన్నట్టు ఇన్క్లూడ్ చేశారు.

కానీ నేడు థియేటర్స్ లో మాత్రం తెలుగులో రెండు రాష్ట్రాల్లోని సినిమా లేదు. మరి దీనితో సినిమా మేకర్స్ దృష్టి సారించలేదా లేక అనుపమ కూడా సీరియస్ గా తీసుకోలేదో ఏమో కానీ ఈ సినిమా మాత్రం తెలుగు రిలీజ్ అనౌన్స్ చేసినప్పటికీ స్టేట్స్ లో తెలుగు భాషలో విడుదలకి నోచుకోలేదు. కొన్ని మేజర్ సిటీలలో మాత్రం డైరెక్ట్ మళయాలం లోనే వచ్చింది.

Exit mobile version