‘ఈ నగరం’లోకి ‘డాకు’ ఎంట్రీ.. క్రేజీ క్యామియో నిజమేనా!?

మన టాలీవుడ్ యువత ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో “ఈ నగరానికి ఏమైంది 2” కూడా ఒకటి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు తరుణ్ భాస్కర్ కలయికలో తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కి సీక్వెల్ గా “ఈఎన్ఈ రిపీట్” అంటూ పార్ట్ 2 ని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. అయితే లేటెస్ట్ గా ఓ క్రేజీ బజ్ దీనిపై వినిపిస్తుంది.

దీనితో ఈ నగరం వరల్డ్ లోకి డాకు మహారాజ్ బాలయ్య ఎంటర్ కానున్నట్టుగా వినిపిస్తోంది. బాలకృష్ణ ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ క్యామియోలో కనిపించే ఛాన్స్ ఉందట. అది కూడా విశ్వక్ సేన్ తో కలిపి ఓ క్రేజీ ఎపిసోడ్ కోసం కొన్ని నిమిషాల పాటు తాను తెరపై కనిపించి అలరించనున్నట్టుగా టాక్. మరి ఇది కానీ నిజం అయితే మాత్రం థియేటర్స్ బ్లాస్టే అని చెప్పవచ్చు. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version