పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా ఈ చిత్రం పూర్తి హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి బాక్సాఫీస్ దగ్గర రికార్డులను సృష్టించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను జూలై 21న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని శిల్ప కళా వేదికలో ఘనంగా నిర్వహించబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను ఓ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.
దీంతో ఈ ఈవెంట్‌ను చూసేందుకు పవన్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూలై 24న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.