‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ కోసం ఏపీలో ఎన్ని థియేటర్లో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌ను జూలై 3న ఉదయం 11.10 గంటలకు గ్రాండ్ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. అయితే, ఈ ట్రైలర్‌ను ఏపీలోని పలు థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

ఈ చిత్ర ట్రైలర్‌ను ఏపీలో ఏకంగా 29 థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అభిమానులకు ఈ చిత్ర ట్రైలర్ కన్నులపండువగా ఉండబోతుందని.. అందుకే ఇలాంటి ట్రైలర్‌ను థియేటర్‌లో చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా ఏ.ఎం.రత్నం అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version