‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ రివ్యూ.. మామూలుగా ఉండదట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను పూర్తి హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా మేకర్స్ రూపొందించారు. ఇక ఈ చిత్రాన్ని దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 3న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. దీంతో ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, ఈ ట్రైలర్‌పై ప్రముఖ నిర్మాత నాగవంశీ తాజాగా తన రివ్యూ ఇచ్చారు. ‘మీరు హరిహర వీరమల్లు ట్రైలర్ నుంచి ఏం ఆశిస్తున్నారో నాకు తెలియదు.. కానీ, మీరు ఆ రోజున సర్‌ప్రైజ్ కావడం ఖాయం. పవన్ కళ్యాణ్ అభిమానులు సిద్ధంగా ఉండండి. హరిహర వీరమల్లు ట్రైలర్ మీకు హై ఇవ్వడం ఖాయం. గ్రాండ్ స్కేల్, మ్యాడ్‌నెస్, మీరు ఇప్పటివరకు చూడని ఎనర్జీతో ఈ ట్రైలర్ వస్తుంది. మీరు దీని గురించి మాట్లాడుకుంటారు.’ అంటూ నాగవంశీ హరిహర వీరమల్లు ట్రైలర్‌పై తన రివ్యూ ఇచ్చారు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరికొత్త గెటప్‌తో కనిపిస్తుండగా అందాల భామ నిధి అగర్వా్ల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూలై 24న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Exit mobile version