ఆసక్తి పెంచుతున్న అల్లరి నరేశ్ ‘ఆల్కహాల్’ ఫస్ట్ లుక్ పోస్టర్

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక నేడు(జూన్ 30) అల్లరి నరేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రాలకు సంబంధించి పలు అప్డేట్స్ వస్తున్నాయి. కాగా, ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో అల్లరి నరేశ్ హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నాడు.

అల్లరి నరేశ్ కెరీర్‌లో 63వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘ఆల్కహాల్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ చిత్రాన్ని మెహర్ తేజ్ డైరెక్ట్ చేస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version