‘కింగ్డమ్’ ఫస్ట్ రివ్యూ : ఫుల్ మీల్స్ ఖాయమంటున్న నిర్మాత నాగవంశీ

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమాను ఇప్పటికే ఆయన చూశానని తెలిపారు. ‘ఈ సినిమా రష్ చూసిన తర్వాత ఈ చిత్రం ఎలా ఉందో అందరూ అడుగుతున్నారని.. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ కావడం ఖాయమని.. నేను ఎంతో నమ్మితే కానీ ఏదీ చెప్పను.. ఎందుకంటే అది కొంచెం మిస్ అయినా, నాపై వచ్చే నెగెటివ్ కామెంట్స్ అంతలా ఉంటాయి. ఈ సినిమా ఖచ్చితంగా విజేతగా నిలుస్తుందని ధీమాగా చెప్పగలను’ అని నాగవంశీ అన్నారు.

కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రంగా కింగ్డమ్ ఓ ఫుల్ మీల్స్ అందిస్తుందని.. గౌతమ్ తనదైన స్టైల్‌లో డ్రామాను పండించాడని నాగవంశీ పేర్కొన్నారు. ఇక త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ టీజర్‌తో పాటు సాంగ్ అనౌన్స్‌మెంట్ కూడా ఇస్తామని ఆయన తెలిపారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

Exit mobile version