కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేస్తున్న అవైటెడ్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ చిత్రం “కూలీ” కూడా ఒకటి. అయితే ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రిలీజ్ కి దగ్గరగా వస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకి పాన్ ఇండియా భాషల్లో కూడా కూలీ అనే టైటిల్ నే పెట్టిన సంగతి తెలిసిందే.
కానీ హిందీలో మాత్రం ఇపుడు కొత్త టైటిల్ ని మార్చినట్టుగా వైరల్ గా మారింది. హిందీలో కూలీ అని కాకుండా ‘మజాదూర్’ అనే టైటిల్ ని లాక్ చేసి ఇదే టైటిల్ తో విడుదల చేస్తున్నట్టుగా తమిళ సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే దీనికి ఇప్పుడు కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పాలి.
హిందీలో కూడా కూలీ అని పెడితేనే బాగుండేది అని లేదా రజినీ కూలీ అని పెట్టుంటే బాగుండేది అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులూ కూలీ టైటిల్ కి అలవాటు పడ్డ ఫ్యాన్స్ ఈ కొత్త టైటిల్ తో మాత్రం హ్యాపీగా లేరనే అనిపిస్తుంది.