కొన్ని కాంబినేషన్స్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర అంచనాలు పీక్స్ లోకి వెళ్లిపోతాయి. మరి అలాంటి ఒక మెంటల్ మాస్ కాంబో కోసమే గత రెండు రోజుల నుంచి మన దక్షిణాదిన ఒక రేంజ్ లో హైప్ నడస్తుంది. అదే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు సెన్సేషల్ దర్శకుడు శంకర్ కాంబో.
ఈ కాంబో నుంచి సినిమా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యిపోయింది అని అన్ని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనితో ఈ సమయంలోనే మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గట్టిగా రచ్చ చేస్తున్నారు. చరణ్ పేరిట నేషనల్ స్థాయిలో ట్విట్టర్ ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది. అంతే కాకుండా ఈ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ కూడా తొందరలోనే రాబోతుంది అని సినీ పెద్దలు కూడా చెబుతున్నారు.
దీనితో మరింత ఎగ్జైటెడ్ గా ఉన్న ఫ్యాన్స్ ఆ సాలిడ్ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఇది ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతం అయితే చరణ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళితో RRR అలాగే కొరటాల దర్శకత్వంలో “ఆచార్య” అనే బడా మల్టీ స్టారర్స్ లో కనిపించనున్నాడు.