మెగాస్టార్ ఇక తప్పుకున్నట్టేనా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “ఆచార్య”. అన్ని సినిమాల్లానే ఈ సినిమా కూడా లాక్ డౌన్ వల్ల ఆగాల్సి వచ్చింది. దీనితో ఆ గ్యాప్ అనంతరం ఎలాగో షూట్ మొదలు పెడదాం అనేసరికి మెగాస్టార్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ స్తంభించింది. దీనితో ఆచార్య షూట్ కూడా డిలే అయ్యింది.

కానీ ఇప్పుడు తాజా టాక్ ప్రకారం మాత్రం. ఈ చిత్రం షూట్ ఎక్కువ కాలమే వాయిదా పడే అవకాశం ఉందని లేటెస్ట్ గాసిప్. అందుకే ఈ చిత్రాన్ని మొదట ప్లాన్ చేసిన సమ్మర్ రేస్ నుంచి తప్పించినట్టు గట్టి టాక్ వినిపిస్తుంది. అలాగే బహుశా ఈ చిత్రం ఒక రెండు నెలల తర్వాత విడుదల అవుతుంది అన్నట్టుగా సమాచారం. మొత్తానికి మాత్రం మెగాస్టార్ మరియు మణిశర్మ, కొరటాల లాంటి సాలిడ్ కాంబో కోసం మాత్రం ఆమాత్రం ఎదురు చూడక తప్పదు.

Exit mobile version