ఇప్పుడు “రాధే శ్యామ్”పై అంచనాలు మరింత పీక్స్.!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. ఈ చిత్ర యూనిట్ ఇటీవలే ఒక కీలక షెడ్యూల్ నిమిత్తం ఇటలీ వెళ్లి అక్కడ నుంచి భారత్ కు తిరిగి వచ్చారు.

అక్కడ షూట్ తో ఎట్టకేలకు చిత్రం అంతిమ దశకు వచ్చేసింది. అయితే ఇక హైదరాబాద్ లో ఒక కీలక సన్నివేశాన్ని తెరకెక్కించడంతోనే షూట్ ముగియనున్నట్టుగా టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో..ఈ చిత్రంపై అంచనాలు ఈ మధ్య మరింత పెరిగాయి. కానీ ఇప్పుడు ప్లాన్ చేస్తున్న షెడ్యూల్ వల్ల మరింత పీక్స్ లోకి వెళ్తున్నాయి అని చెప్పాలి.

హైదరాబాద్ లో ఈ షూట్ ను భారీ బడ్జెట్ సెట్టింగ్ లో చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా ఈ సెట్ లో సన్నివేశం కూడా ప్రభాస్ చెప్పిన ఏకైక యాక్షన్ బ్లాక్ ఏమో అనే సందేహాలు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. దీనితో ఈ బ్లాక్ మూలాన ఈ చిత్రంపై అంచనాలు ఇపుడు మరింత పెరిగాయి.

దాదాపు 30 కోట్లతో ఈ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుండడంతో ఖచ్చితంగా ఈ సీన్ గట్టిగానే ఉంటుందని అర్ధం అవుతుంది. మరి ఈ సన్నివేశం యాక్షన్ సన్నివేశమేనా లేక మరేమన్నానా అన్నది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version