రాజమౌళికి షాకింగ్ రిప్లై ఇచ్చిన వర్మ !

మన సినీ సెలబ్రిటీలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. రాజ్యసభ సభ్యుడు జొగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, సునీల్, రకుల్ ప్రీత్, రానా, శ్రద్దా కపూర్, అలియా భట్, జగపతిబాబు లాంటి సెలబ్రిటీలు చాలామంది ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు. తాజాగా ఈ మొక్కలు నాటిన దర్శకుడు రాజమౌళి సహ దర్శకులు పూరి జగన్నాథ్, వినాయక్, రామ్ గోపాల్ వర్మలకు ఛాలెంజ్ ఫార్వర్డ్ చేశారు.

ఎప్పుడూ వివాదలతో స్నేహం చేసే వర్మ రాజమౌళికి కూడ అలాంటి వివాదాస్పద సమాధానమే ఇచ్చారు. ‘రాజమౌళి గారు.. నేను గ్రీన్‌కు, ఛాలెంజ్‌లకు దూరం. మట్టిని ముట్టుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. మొక్కలకు నాలాంటి స్వార్థపరుడు అవసరం లేదు. మీకు, మీ మొక్కలకు ఆల్ ది బెస్ట్` అంటూ ట్వీట్ వేశారు. అది చూసిన నెటిజన్లు అనవసరంగా రాజమౌళి వర్మకు ఛాలెంజ్ పంపినట్టున్నారే. పంపకుండా ఉండాల్సింది. సమాజం గురించి అన్ని మాటలు చెప్పే వర్మ ఇలాంటి మంచి పని చేయవచ్చు కదా అంటున్నారు.

Exit mobile version