ఐపీఎల్ చూసేందుకు దుబాయ్ వెళ్లిన సూపర్ స్టార్


ఈరోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మామూలుగా అయితే ఐపీఎల్ ఇండియాలోనే జరిగేది. కానీ కోవిడ్ దృష్ట్యా దుబాయ్ లో జరుపుతున్నారు. దీంతో లక్షలాది మంది క్రికెట్ ప్రియులు నేరుగా ఐపీఎల్ వీక్షించే అవకాశాన్ని మిస్సయ్యారు. మామూలు ప్రజలే కాదు సినీ సెలబ్రిటీల్లో కూడ చాలామంది క్రికెట్ ప్రియులు ఉన్నారు. ప్రతి సీజన్లో నేరుగా స్టేడియంకు వెళ్ళి మ్యాచ్ లను వీక్షించి ఆనందం పొందేవారు. ఇక ఫైనల్స్ అంటే పెద్ద సంఖ్యలో సినీ తారలు స్టేడియం చేరుకునేవారు.

కానీ ఈసారి దుబాయ్ వేదిక కావడం, ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో సెలబ్రిటీలు వెళ్ళలేకపోయారు. కానీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం దుబాయ్ వెళ్లి స్టేడియం నుండి డిల్లీ క్యాపిటల్స్ వెర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ను వీక్షిస్తున్నారు. వీఐపీ గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ చూశారు ఆయన. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మోహన్ లాల్ ఇటీవలే ‘దృశ్యం 2’ షూటింగ్ ముంగించారు. ప్రస్తుతం ఆ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Exit mobile version