రాజకీయాల్లోకి వస్తారా అనడిగితే సూర్య ఏమన్నాడో తెలుసా !

తమిళ సినీ పరిశ్రమ వేడి వేడిగా ఉంది. ఎప్పుడూ సినిమాలు, ఫ్యాన్ వార్స్, కలెక్షన్లు ఇలా హడావిడిగా ఉండే తమిళ పరిశ్రమలో కొన్నిరోజులుగా రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో స్టార్ హీరోల రాజకీయ రంగప్రవేశాలు తెరమీదకి వస్తున్నాయి. సూపర్ స్టార రజినీకాంత్ ఎన్నికల్లో పోటీ చేస్తారా చేయరా, ఆయనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఉందా లేదా అనే అనుమానాలు కొనసాగుతుండగా ఇలయదళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టారంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. చివరికి విజయ్ తాను పార్టీ పెట్టలేదని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

అలాగే మరొక ప్రముఖ హీరో సూర్య మీద కూడ వార్తలు మొదలయ్యాయి. సూర్యకు సమాజ సేవ చేసే గుణం ఎక్కువ. అందుకే ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకునేవారు చాలామందే ఉన్నారు. ఆ కారణంగానే ఆయన పొలిటికల్ ఎంట్రీ మీద చర్చ మొదలైంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్య రాజకీయాల్లో ఎప్పుడు వస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా ‘నా మెదడులో మెదిలే ఆలోచనలన్నీ నా మనసులోంచి వచ్చేవే. నిజం చెప్పాలంటే నాకు ఆ ఉద్దశ్యం లేదు’ అంటూ సున్నితంగా రాజకీయాల్లోకి రావనని చెప్పేశారు. దీంతో ఆయన మీద వస్తున్న రూమర్లకు బ్రేక్ పడినట్లైంది. ఇకపోతే సుధా కొంగర దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఆకాశం నీ హద్దురా !’ చిత్రం ఈ నెల 12న అమెజాన్ ప్రాయం ద్వారా విడుదలకానుంది.

Exit mobile version