“ఆదిపురుష్” కు మేజర్ ఆఫ్ ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ ఇదే.!

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మొత్తం మూడు భారీ చిత్రాల్లో భారీ బడ్జెట్ తూ తెరకెక్కనున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ప్లాన్ చేస్తున్న ఈ భారీ ఇతిహాస చిత్రం పై అంతే స్థాయి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రామునిగా ప్రభాస్ రావణునిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ను మేకర్స్ కన్ఫర్మ్ చేసేసిన సంగతి తెల్సిందే. కానీ ఒక్క హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

దీనితో ఈ అంశం అక్కడ నుంచి మంచి సస్పెన్స్ గా మారింది. అయితే ఈ కీలక రోల్ కు గాను చాలా మంది స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్నాయి కానీ డార్లింగ్ హీరో ఫ్యాన్స్ పల్స్ మాత్రం ఓ హీరోయిన్ వైపే ఎక్కువగా ఉంది. ఆమెనే స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ. ఎందుకో వీరిద్దరి జంట ఈ సినిమాకు చక్కగా అభినయంగా కుదురుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈమె పేరు అండర్ లో ఉంది. మరి మేకర్స్ ఎవరిని ఫిక్స్ చేస్తారో చూడాలి.

Exit mobile version