“బిగ్ బాస్” హౌస్ లో ఈ కాంట్రవర్సీ వెనుక సీక్రెట్ ఇదేనట.!

బిగ్ బాస్ షో అంటేనే కాంట్రవర్సీలతో కూడిన ఎంటెర్టైన్మెంట్ కు పెట్టింది పేరు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు గాంచిన ఈ గ్రాండ్ రియాలిటీ షో మన తెలుగులో కూడా భారీ ఎత్తున ఫేమస్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో నాలుగో సీజన్లో దూసుకెళ్తుంది. అయితే లేటెస్ట్ ఎపిసోడ్ లో మాత్రం ఆడియెన్స్ ఊహించని అనుభూతిని చూసారు.

ఎప్పుడు కంట్రోల్ కోల్పోని అవినాష్ నోయెల్ విషయంలో తప్పడం ఒక్కసారిగా షాక్ కు గురు చేసింది. దీనితో ఇందుకు కారణం ఏమిటా అని అంతా అనుకుంటున్నారు. అలాగే అవినాష్ పై కూడా హేటర్డ్ పెరిగింది. కానీ అసలు విషయంలోకి వెళ్తే ఇదంతా కేవలం మేకర్స్ స్క్రిప్ట్ అన్నట్టుగానే తెలుస్తుంది. ఇప్పటి వరకు అవినాష్ విషయంలో ఎలాంటి వివాదాలు లేకుండా ఉన్నాయి అది మరీ సేఫ్ గేమ్ అవుతుంది కాబట్టి ఇలా ప్లాన్ చేశారట. మొత్తానికి మాత్రం ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యింది అని చెప్పాలి.

Exit mobile version