నేషనల్ స్టార్ గా ప్రభాస్ తన మార్కెట్ కి తగ్గట్లుగానే బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను సెట్ చేసుకుంటూ పోతున్న క్రమంలో బాలీవుడ్ బడా దర్శకుడు సంజయ్ రౌత్ తో “ఏ- ఆది పురుష్” అనే మరో భారీ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ లాంటి మహుమహులు నటిస్తారని ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. తాజాగా మరో రూమర్ ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ‘ఆదిపురుష్’లో మాజీ హీరోయిన్ కాజోల్ కూడా నటించబోతుందని తెలుస్తోంది.
అయితే కాజోల్ గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోన్నా.. మధ్యలో కొన్ని సినిమాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాత్ర అయితే ఆ సినిమాలు చేస్తోంది. మరి భారీ స్థాయీలో హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా రూపొందించబోతున్న ఆదిపురుష్ లో ఓ అత్యంత కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రకు కాజోల్ అయితేనే న్యాయం జరుగుతుందని.. అందుకే ఆమెను ఆ పాత్ర చేయడానికి ఒప్పించారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రభాస్ బాడీ పెంచనున్నాడు. ఎందుకంటే సినిమాలో ప్రభాస్ ఎనిమిది అడుగుల అజానబాహుడిగా కనిపించబోతున్నాడు.