‘రొమాంటిక్’ విడుదల తేదీ ప్రకటించిన పూరి

డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా తెరెకెక్కుతున్న చిత్రం రొమాంటిక్. నూతన దర్శకుడు అనిల్ పాదూరి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. నేడు ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించారు. వేసవి కానుకగా రొమాంటిక్ మూవీ మే 29న విడుదల చేస్తున్నారు. రొమాంటిక్ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా పోస్టర్స్ ఆసక్తి రేపుతున్నాయి.

ఇక రొమాంటిక్ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు మరియు కథ పూరి జగన్నాధ్ అందించారు. ఇక ఈ చిత్రం పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మి మరియు పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ చిత్రానికి సంగీతం సునీల్ కశ్యప్ అందించారు. కాగా ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ కీలక రోల్ చేస్తున్నారు.

Exit mobile version