ఉప్పెన చిత్రంలోని విజయ్ లుక్ పరిచయం చేస్తారట

మెగా ఫ్యామిలీ నుండి పరిచయం అవుతున్న మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఆయన హీరోగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న చిత్రం ఉప్పెన. లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరక్కుతుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నెగెటివ్ షేడ్స్ ఉండే మాస్ రోల్ చేస్తున్నారని సమాచారం. ఉప్పెన చిత్రంలో ఆయన చేస్తున్న పాత్రపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో రేపు ఆయన లుక్ రివీల్ చేస్తున్నారు. రేపు సాయంత్రం 4:50 నిమిషాలకు ఆయన మాస్ లుక్ విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ నేడు ప్రకటించింది.

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఉప్పెన చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. ఉప్పెన చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది.

Exit mobile version