“కృష్ణం వందే జగద్గురుం” చిత్ర చిత్రీకరణ సమయంలో రానా దవడకి గాయమయ్యింది ఈ గాయానికి ఆయన సర్జరీ చేసుకున్నారు. రెండు వారల క్రితం ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశ చిత్రీకరణలో రానా దవడకి గాయం అయ్యిందని సమాచారం. వెంటనే దర్శకుడు క్రిష్ షూటింగ్ నిలిపివేశారు, రానా చికిత్స పొందాక చిత్రీకరణలో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నాను అని చెప్పినా ఆరోజుకి చిత్రీకరణ నిలిపివేశారు. చిత్ర బృందం ఆశ్చర్యపోయేలా రానా త్వరగా కోలుకోవడమే కాకుండా కోలుకున్న మరుసటిరోజు నుండి చిత్రీకరణలో పాల్గొన్నారు. ఇదే చిత్ర చిత్రీకరణ సమయంలో ఈ ఏడాది మొదట్లో అయన గాయాలపాలయ్యారు ఈ సంఘటనలో అయన భుజానికి గాయం అయ్యింది. ఇవన్ని చూస్తుంటే “కృష్ణం వందే జగద్గురుం” మంచి యాక్షన్ ఎంటర్ టైనర్లా కనిపిస్తుంది.నయనతార ఈ చిత్రంలో రానా సరసన కనిపించనుంది. వై రాజీవ్ రెడ్డితో కలిసి సాయిబాబా జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా వి ఎస్ జ్ఞానషేకర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి ఈ ఏడాదే ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో విడుదల కానుంది.