‘డమరుకం’ ఆడియో విడుదల తేదీ ఖరారు


‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’. ఈ చిత్ర ఆడియోని ఈ నెల(సెప్టెంబర్) 10న విడుదల చేయనున్నారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మొత్తం 10 పాటలు ఉంటాయి. పూర్తి కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యోగా బ్యూటీ అనుష్క కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో చార్మింగ్ బ్యూటీ ఛార్మి సక్కుభాయిగా ఒక ఐటెం సాంగ్ లో కనిపించనున్నారు. కామెడీ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల వల్ల చాలా కాలంగా ప్రొడక్షన్ దశలోనే ఉంది. నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్.ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై వెంకట్ నిర్మిస్తున్నారు. గతంలో నాగార్జున – దేవీ శ్రీ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మ్యూజిక్ కూడా అలానే ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

Exit mobile version