యు.ఎస్ లో రికార్డ్ స్థాయిలో విడుదల కానున్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్


అవును మీరు విన్నది నిజమే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ఇప్పటివరకూ యు.ఎస్ లో ఏ తెలుగు చిత్రం విడుదల కానంత భారీగా విడుదల కానుంది . ఈ చిత్రం యు.ఎస్ లో సుమారు 55 సెంటర్లకు పైనే విడుదల కానుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ పెద్ద హీరో సినిమా కూడా ఇన్ని సెంటర్లలో విడుదల కాలేదు. ఈ రోజు ప్రసాద్ లాబ్స్ లో జరిగిన ప్రెస్ మీట్లో శేఖర్ కమ్ముల ఈ విషయాన్ని తెలియజేసారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 14న విడుదల కానుంది. యు.ఎస్ లో ఇన్ని సెంటర్లలో విడుదలవడం చూస్తె యు.ఎస్ మార్కెట్లో శేఖర్ కమ్ముల కి ఎంత డిమాండ్ ఉందో తెలుస్తోంది. ఫైకస్ వారు ఈ చిత్రాన్ని యు.ఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సీడెడ్లో సాయి కొర్రపాటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మరియు నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

Exit mobile version