కింగ్ అక్కినేని నాగార్జున నటించిన భక్తి రస చిత్రం ‘శిరిడి సాయి’ ఈ వారం సెప్టెంబర్ 6న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర అన్ని ఏరియాల బిజినెస్ దాదాపు పూర్తయింది. పెద్ద నిర్మాతలు ఈ చిత్ర కొన్ని ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు దక్కించుకోవడం విశేషం. నైజాం ఏరియా హక్కులు దిల్ రాజు దక్కించుకోగా, కృష్ణ జిల్లా హక్కులు అశ్వినీదత్ దక్కించుకున్నారు. తూర్పు గోదావరి హక్కులు వల్లూరిపల్లి రమేష్, సీడెడ్ ఏరియాకు గాను బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెల్లూరు జిల్లా హక్కులు శ్రీ వెంకటేశ్వర ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ వారు 81 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. నాగార్జున గతంలో నటించిన భక్తి చిత్రాలు అన్నమయ్య, శ్రీ రామదాసు చిత్రాలు ఎంతటి ప్రేక్షకాదరణ పొందాయో అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా పై అదే స్తాయిలో అంచనాలు ఉన్నాయి.