నేను మళ్ళి ఇక్కడికి వస్తున్నాను అన్న భావన కలగడం లేదు :శ్రీదేవి


ఈ వయసులో కూడా శ్రీదేవి చరీష్మ తగ్గినట్టు కనిపించడం లేదు. ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో తన రాబోతున్న చిత్రం “ఇంగ్లీష్ వింగ్లిష్” ట్రైలర్ ని ఆవిష్కరించడానికి ప్రముఖ మల్టీ ప్లెక్స్ కి వచ్చిన శ్రీదేవిని చూడటానికి జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో స్వల్పంగా తొక్కిసలాట కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమెతో పాటు బోని కపూర్, బాల్కి, గౌరీ షిండే మరియు ప్రియ ఆనంద్ ఉన్నారు. మీడియాతో మాట్లాడుతూ “హైదరాబాద్ నాకు ఇల్లు వంటిది నేను తిరిగి వస్తున్నా అని అనుకోవట్లేదు. ఈ కథతో గౌరీ నా దగ్గరకు వచ్చినప్పుడు కథతో నేను ప్రేమలో పడిపోయాను అందుకే ఒప్పుకున్నాను” అని శ్రీదేవి అన్నారు. ఈ చిత్రం ఒక మహిళ తన కుటుంబాన్ని ఆకట్టుకోడానికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చేసిన ప్రయాణం. ఈ చిత్రం గురించి ఏమయినా చెప్పండి అని అడిగిన ప్రశ్నకి ” ఈ చిత్రం లో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈ చిత్రానికి ఈజీగా కనెక్ట్ అవుతారు” అని అన్నారు. ఈ చిత్రం తన తల్లిని చూసి వచ్చిన కథ అని, ప్రతి కుటుంబంలో తల్లి ఇంగ్లీష్ నేర్చుకోడానికి పడే కష్టమే ఈ చిత్రం అని గౌరీ షిండే అన్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించగా బాల్కి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంగ్లీష్ వింగ్లిష్ చిత్రం అక్టోబర్ 5న తెలుగు,తమిళం మరియు హిందీలలో విడుదల కానుంది.

Exit mobile version