ప్రస్తుతం బిజీగా ఉన్న కథానాయికలలో శ్రియా ఒకరు. ఇటీవలే ఒక ఫేమస్ మెన్ మాగజైన్ కి హాట్ గా ఫోజులిచ్చింది. ఆ తర్వాత తిరుమలలో ప్రత్యక్షమైవేంకటేశ్వరుని దర్శించుకుంది. ప్రస్తుతం ఈ భామ తను నటిస్తున్న ‘చంద్ర’ అనే ద్విభాషా చిత్రం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో శ్రియా యువరాణి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం అంతా మైసూర్, బెంగుళూరు మరియు రాజస్తాన్ లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఒక రాజ వంశంలో పుట్టిన ఒక అమ్మాయి సాధారణ జీవితాన్ని గడపలేక ఎదుర్కొనే ఇబ్బందుల చుట్టూ అల్లుకొన్న కథ ఇది. కన్నడ మరియు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. రూప అయ్యర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గణేష్ శ్రీవత్స సంగీతం అందిస్తున్నారు. శ్రియా ప్రస్తుతం ఈ చిత్రం కాకుండా త్వరలో విడుదల కానున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.