ప్రారంభమైన ‘గౌరవం’ రెండవ షెడ్యూల్


‘ఆకాశమంత’, ‘గగనం’ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాధామోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం ‘గౌరవం’. ఈ చిత్రానికి సంభందించిన రెండవ షెడ్యూల్ కొద్ది రోజుల క్రితమే రాజమండ్రిలో ప్రారంభమైంది. గత నెలలో ఈ చిత్ర మొదటి షెడ్యూల్ చిత్రీకరణ మైసూర్ లోని అందమైన ప్రదేశాల్లో జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన పూర్తి టీం రాజమండ్రిలో ఉంది మరియు ఇక్కడ ఈ చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో యామి గౌతమ్ కథానాయికగా నటిస్తోంది మరియు శ్రీ చరణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version