ప్రస్తుతం ప్రియా ఆనంద్ ‘కో అంటే కోటి’ టీంతో కలిసి ఆ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ మరియు ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘ఆవకాయ్ బిర్యాని’ ఫేం అనీష్ కురువెల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శర్వానంద్ నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం ఈ చిత్ర యూనిట్ రాజమండ్రి చేరుకుంది. ‘ ప్రస్తుతం ‘కో అంటే కోటి’ చిత్రంలోని ‘సత్య’ పాత్ర కోసం సిద్దమవుతున్నాను. అనిష్ కురువెల్ల నా కోసం చాలా మంచి పాత్రను తయారు చేశారని’ ప్రియా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతే కాకుండా ‘నేను పాల్గొన్న మొదటి రోజు చిత్రీకరణలో 50 మంది పిల్లలతో కలిసి నటించాను. 50 మంది పిల్లలతో మరియు శర్వానంద్ తో కలిసి ఈ రోజు బాగా ఎంజాయ్ చేశాను, దీనికి సంభందించిన ఫోటో త్వరలోనే పోస్ట్ చేస్తాను’ అని కూడా ప్రియా ఆనంద్ తన పోస్ట్ లో తెలియజేశారు. 2011లో వచ్చిన ‘180’ చిత్రం తర్వాత తెలుగులో ప్రియా ఆనంద్ అంగీకరించిన చిత్రం ఇదే. ఇది కాకుండా ప్రియా ఆనంద్ ప్రస్తుతం ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘రన్గ్రేజ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు, ఇది ‘శంభో శివ శంభో’ చిత్రానికి రిమేక్.