రాజమౌళి – సూర్య కాంబినేషన్లో సినిమా రానుందా?


అన్నీ కుదిరితే టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి మరియు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కలిసి ఓ ద్విభాషా చిత్రం చెయ్యాలనుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితమే చెన్నైలో సూర్యని రాజమౌళి కలవడంతో సూర్యతో సినిమా చేస్తున్నాడని ఒక ప్రముఖ న్యూస్ పేపర్ వారు ప్రచారం చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘నాన్ ఈ’ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాదించింది. ఈ స్టార్ డైరెక్టర్ తమిళంలో సినిమా చెయ్యడానికి ఉత్సాహం చూపుతున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. ఈ మధ్యనే రాజమౌళి – సూపర్ స్టార్ రజనీకాంత్ కలిసి సినిమా చేయనున్నారు అనే పుకార్లు కూడా వినిపించాయి. ఈ పుకార్లను రాజమౌళి కొట్టి పారేశారు. కానీ భవిష్యత్తులో సూర్యతో సినిమా చేస్తాను అనే విత్తనాన్ని మాత్రం ప్రేక్షకుల మదిలో నాటారు.

‘ నేను మరియు సూర్య సందర్భానుసారంగానే కలిశాము కానీ ఇద్దరం కలిసి పని చేయాడానికి ఆసక్తి గానే ఉన్నాము. కానీ ఒక సినిమా చేయాలంటే స్పష్టం చేసుకోవలసిన విషయాలు చాలా ఉంటాయని’ రాజమౌళి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. సూర్యకి తెలుగు మరియు తమిళంలో మంచి మార్కెట్ ఉంది, ఒకవేళ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాక్స్ ఆఫీసు దగ్గర కనక వర్షం కురుస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తారా లేదా అనే దానికోసం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం రాజమౌళి ప్రభాస్ హీరోగా ఒక సినిమా తీయడానికి కమిట్ అయ్యారు.

Exit mobile version