మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే ‘ఎవడు’ చిత్రం చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు. గత కొన్ని వారాల క్రితం రామ్ చరణ్ బాంకాక్ లో జరిగిన ‘జంజీర్‘ చిత్ర చిత్రీకరణలో పాల్గొన్నారు, ఆ తర్వాత కోల్ కతా లో వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఆగష్టు 7 నుండి జరగబోయే ‘ఎవడు’ చిత్ర చిత్రీకరణలో రామ్ చరణ్ పాల్గొననున్నారు. సమంత మరియు అమీ జాక్సన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అక్టోబర్ నుండి సమంత ఈ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ మరియు అమీ జాక్సన్ ల మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవలే రామ్ చరణ్ మరియు స్కార్లెట్ విల్సన్ మీద ఒక ఐటెం సాంగ్ ని కూడా చిత్రీకరించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.