‘బుల్లెట్ రాజా’గా రవితేజ ప్రేక్షకులతో దరువు వేయిస్తాడు


మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘దరువు’ ఈ వారం విడుదలవుతున్న మనకు విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సినిమా విశేషాలు గురించి ఆయన తెలియజేస్తూ ఈ సినిమాలో రవితేజ ‘బుల్లెట్ రాజా’ అనే పాత్ర పోషిస్తున్నట్లు ఈ సినిమాకి అతని పాత్ర హైలెట్ అవుతుందని, అలాగే ఐదు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో రవితేజ కనిపిస్తాడని తెలిపారు. ఈ సినిమాలో యమలోకం ఎపిసోడ్ బాగా అలరిస్తుంది. గత మూడు దశాబ్దాలుగా ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ చిత్ర దర్శకుడు శివ మా బ్యానర్లో వచ్చిన ‘బద్రి’ సినిమాకి అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేసాడు. ‘శ్రీరామ్’ సినిమాకి కెమెరామెన్ గా పనిచేసాడు. ఆ తరువాత దర్శకుడిగా తెలుగులో రెండు సినిమాలు చేసాక నాకు ‘దరువు’ కాన్సెప్ట్ చెప్పాడు. విన్న వెంటనే అంగీకరించి షూటింగ్ మొదలుపెట్టాము అన్నారు. ఈ సినిమా సెన్సార్ అయ్యాక మా టీం అంతా చూసాము. దరువు తప్పకుండ అందరినీ అలరిస్తుందన్న గట్టి నమ్మకం తనకుంది అన్నారు. దరువు ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Exit mobile version