పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కలెక్షన్లలో రెండవ వారం కూడా అదరగొడుతుంది. ఇటు ఇండియాలను అటు ఓవర్సీస్ లోను కలెక్షన్లు ఎక్కడ తగ్గకపోవడం విశేషం. పవన్ కళ్యాణ్ భారీ హిట్ కొట్టడంతో పవన్ అభిమానులు ఆనందంలో ఉండగా పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ కి కూడా బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో చిత్ర నిర్మాత బండ్ల గణేష్ బాబు పవన్ కళ్యాణ్ తో మరో సినిమాకి రెడీ అయినట్లు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఆడియో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.