పరిచయం అక్కర్లేని దర్శకుడు కె. రాఘవేంద్ర రావు గారు. 1942 మే 23న పుట్టిన ఈ సీనియర్ దర్శకుడు నేటితో 70 వసంతాలు పూర్తి చేసుకున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఈయన చిన్ననాటి జీవితం అంతా సాదాసీదాగా సాగింది. బిఎ పూర్తి చేసిన తరువాత అయన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ‘బాబు’ అనే చిత్రానికి మొదటగా దర్శకత్వం వహించిన ఆయన తెలుగు సినిమాకి కమర్షియల్ అంశాలు జోడించి తెలుగు సినిమా స్థాయిని పెంచారు. పాటలో చిత్రీకరణలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసి చూపించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలందరి సినిమాలకు దర్శకత్వం వహించిన ఈయన నితిన్ వంటి చిన్న హీరోలతో కూడా సినిమాలు తీసారు. హీరోయిన్లను ప్రత్యేకంగా చూపించే రాఘవేంద్ర రావు గారు శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, రమ్యకృష్ణ వంటి హీరోయిన్లకు కెరీర్ హెల్ప్ అయ్యేలా చూపించారు.
అన్నమయ్య, శ్రీ రామదాసు వంటి భక్తి రస చిత్రాలు కూడా తీసి హిట్స్ కొట్టిన ఆయన ప్రస్తుతం నాగార్జునతో ‘శిరిడి సాయి’ అనే చిత్రం రూపొందిస్తున్నారు. 123 తెలుగు.కాం తరపున ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.