యు టివి స్టార్స్ లో ప్రసారం అయ్యే “ది చూజేన్ వన్” అనే రియాలిటి షో కి జెనిలియా హోస్ట్ గా వ్యవహరించబోతుంది. ఈ రియాలిటి షోలో పదకొండు మంది పాల్గొననున్నారు గెలిచినవారికి బాలివుడ్ లో నటించే అవకాశం దక్కనుంది. కొన్ని వారాల క్రితం రానా మరియు నేహ ధూపియ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా సంతకం చేశారు. ఇప్పుడు ఈ షో ని జెనిలియా హోస్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది.దాదాపుగా మూడు నెలల తరువాత ఒక చిత్రం కాని టీవీ షో కాని జెనిలియా ఒప్పుకుంది. గతంలో జెనిలియా యు టీవీ బిందాస్ లో “బిగ్ స్విచ్” అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేసింది. “నా ఇష్టం” చిత్రం తరువాత ఈ భామ తెలుగులో ఎటువంటి చిత్రాన్ని ఒప్పుకోలేదు. హిందీలో “రాక్ ది షాదీ” మరియు “బ్లడి పాకి” చిత్రాలలో నటిస్తుంది .