అల్లు అర్జున్, ఇలియానాలు ప్రధాన పాత్రలలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “జులాయి”. ఈ చిత్రం లో నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు పాటల మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మరియు ఇలియానా ల మధ్య నడిచే సన్నివేశాలు చిత్రానికి ఆకర్షణగా నిలువబోతున్నాయి. ఈ మధ్యనే ఈ చిత్రం దుబాయ్ లో కొన్ని పాటలను చిత్రీకరించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం జూన్ మొదటి వారం లో విడుదల కానుంది. ఈ చిత్రం లో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ చిత్రానికే ప్రధాన ఆకర్షణ కానుంది. సోను సూద్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మీద రాధా కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమయ్యింది