రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో ఇటీవల వచ్చిన ‘డిపార్ట్మెంట్’ ఫ్లాప్ కావడంతో వర్మ నిరాశకు లోనయినట్లుగా కనిపిస్తుంది. ఈ చిత్రం పై వచ్చిన సమీక్షలపై ఓపెన్ లెటర్ విడుదల చేసిన వర్మ తన ట్విట్టర్ అకౌంటులో సంజయ్ దత్ పై తన కోపాన్ని ప్రదర్శించాడు. తన సినిమా పరాజయాన్ని సమర్ధించుకునే వర్మ ఇలా చేయడం విడ్డూరంగా ఉంది. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రానా, మంచు లక్ష్మి, అభిమన్యు సింగ్ వంటి భారీ తారాగణాన్ని పెట్టి రోగ్ మెతడాలజీ అంటూ చేసిన ప్రయోగం వికటించడం కేవలం ఒక్క పాటలో మాత్రమే ఉన్న నతాలియ కుర్ పై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం వాళ్ళ డిపార్ట్మెంట్ ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది.