ఎందుకంటే ప్రేమంట సినిమాలో డాన్సులు అదరగొట్టిన రామ్


ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న యువ హీరోలలో డాన్సులు చేయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్ త్వరలో రానున్న ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమాలో కూడా డాన్సులు అదరగొట్టాడని సమాచారం. ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్స్ బట్టి చూస్తే కూడా ఈ విషయం అర్ధమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం జూన్ నెలలో విడుదలకు సిద్ధమవుతుంది. రామ్ సరసన తమన్నా నటించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇటీవలే ఈ చిత్ర ఆడియో విడుదలైంది. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు.

Exit mobile version