విద్య బాలన్ ప్రధాన పాత్రలో నటించిన “కహాని” చిత్రం అటు ప్రేక్షకులను ఇటు విమర్శకులను ఆకట్టుకుంది. ఈ ఏడాది మొదట్లో విడుదలయిన ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో రీమేక్ కానుంది. బిగ్ బాస్ మరియు ఫియర్ ఫాక్టర్ వంటి టివి షో లు చేసిన ఎండేమోల్ ప్రొడక్షన్స్ ఈ చిత్ర రీమేక్ హక్కులను కైవసం చేసుకున్నారు ఇదే వీరి నిర్మాణంలో రాబోతున్న తొలి చిత్రం. ఈ నిర్మాణ సంస్థ తెలుగులో ప్రముఖ నటులతో ఈ చిత్రంలో పాత్రల గురించి చర్చించినట్టు సమాచారం అనుష్క ప్రధాన పాత్ర చేయ్యబోతుందని పుకారు కూడా వినిపించింది .అనుష్క కాని ఎండేమోల్ నిర్మాణం వారు కాని ఈ విషయాన్నీ ధ్రువీకరించలేదు. ఈ చిత్ర రీమేక్ సెప్టెంబర్ లో చిత్రీకరణ మొదలు పెట్టుకుంటుంది రాబోయే సంవత్సరం జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. హిందీ చిత్రానికి దర్శకత్వం వహించిన సుజోయ్ గోష్ ఈ రిమేక్ లకు సహాయ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ చిత్ర బృందం గురించి మరిన్ని విశేషాలు త్వరలో ప్రకటిస్తారు