దేవుడు చేసిన మనుషులు కోసం కష్టపడుతున్న రఘు కుంచె

దేవుడు చేసిన మనుషులు చిత్ర సంగీత విషయంలో రఘు కుంచె ఎటువంటి అవకాశాన్ని తీసుకోవదల్చుకోట్లేదు ఈ చిత్ర సంగీతాన్ని ఎలాగయినా భారీ విజయం సాధించేలా మలచాలని నిర్ణయించుకున్నట్టున్నారు.పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవి తేజ,ఇలియానా మరియు ప్రకాశ్ రాజ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రం కోసం ఈయన పలువురు ప్రముఖ గాయకులను ఈ చిత్రం కోసం పాడించారు. ఈ చిత్రంలో శ్రేయ ఘోషల్ పైన పాట అద్బుతంగా వచ్చిందని వినికిడి. రఘు కుంచె ఈ చిత్రానికి నేఫధ్య సంగీతం అందించడం కూడా మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మూడు పాటల చిత్రీకరణ కోసం రవి తేజ మరియు ఇలియానా ఇటలీ పయనమయ్యారు.ఈ చిత్ర ఆడియో జూన్ మొదటి వారం విడుదల కావచ్చు “దేవుడు చేసిన మనుషులు” చిత్రం జూలై లో విడుదల కానుంది.

Exit mobile version