పెటా (జంతు సంరక్షణ సంస్థ)కి సహాయపడే తారలలో ప్రియ ఆనంద్ చేరిపోయారు. గత కొన్నేళ్ళుగా త్రిష ఈ సంస్థకి తోడ్పడుతు ఉంది వీధి కుక్కల సంరక్షణ చర్యలు తీసుకోవటంలో ముందుంది. ప్రస్తుతం ప్రియ ఆనంద్ కూడా ఈ వరుసలో చేరారు. ఈ మధ్య చెన్నై మేయర్ వీధి కుక్కలను పట్టుకొని బంధించాలని జారే చేసిన ఆదేశాన్ని పెటా ఖండించింది. ఈ అంశం మీద పెటాకి పలు తారల తోడ్పాటు అందుతుంది ఈ ఆదేశాన్ని తిరస్కరించిన వారిలో త్రిష,రేగిన,ప్రియ ఆనంద్ తో పాటు మరికొంత మంది తారలు ఉన్నారు. ఈ తిరస్కరణ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుందో లేదో వేచి చూడాలి.