ఈ నెల రెండవ వారం నుండి సీతమ్మ వాకిట్లో … షూటింగ్లో మహేష్


ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా మల్టి స్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్ర షూటింగ్లో ఈ నెల 11 నుండి పాల్గొననున్నాడు. విక్టరీ వెంకటేష్ మరియు మహేష్ బాబు అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ చిత్రంలో వీరి తండ్రిగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా సమంతా నటిస్తుండగా మరో పాత్రలో అంజలి నటిస్తుంది. తన మొదటి చిత్రం ‘కొత్త బంగారు లోకం’తో అందరి దృష్టినీ ఆకర్షించిన శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ చిత్రాల నిర్మాత, గోల్డెన్ హ్యాండ్ అని పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు ఈ చిత్రంతో పాటుగా సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న సినిమాలో కూడా పాల్గొంటున్నాడు.

Exit mobile version