“బిజినెస్ మాన్” చిత్రంతో యువత మనసులను కొల్లగొట్టిన ఐటెం గర్ల్ శ్వేత భరద్వాజ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ సరసన “ఎవడు” చిత్రం కోసం ఒక పాటలో నృత్యం చేయ్యనుంది. ఈ అవకాశం శ్వేత వద్దకు వెళ్ళింది ఇంకా అధికారికంగా ఒప్పుకోలేదు. ఆకట్టుకునే అందానికి డాన్స్ తోడయ్యి ఐటెం సాంగ్స్ లో అద్బుతమయిన హావ భావాలను పలికిస్తున్న శ్వేతా తెలుగులో మంచి ఐటెం గర్ల్ గా పేరు తెచ్చుకుంది.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. సమంత మరియు ఏమి జాక్సన్ లు ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈసారి శ్వేతా ఎటువంటి ప్రదర్శనతో మన ముందుకి వస్తుందో వేచి చూడాలి.