అవును మీరు విన్నది నిజమే. ఇది ఒక చిత్రానికి శీర్షిక (ఒక్క టికెట్ కే వంద సినిమాలు). అలరి నరేష్ రాబోతున్న చిత్రం “సుడిగాడు” చిత్రానికి శీర్షిక ఇది. ఈ చిత్రం పలు పెద్ద చిత్రాలకు స్పూఫ్ కాబోతుంది.తమిళం లో విడుదలయ్యి భారీ విజయం సాదించిన “తమిళ్ పడం” చిత్రానికి ఈ చిత్రం రీమేక్. భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మరి కొద్ది రోజుల్లో చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం అల్లరి నరేష్ ఒక పాట పాడుతున్నట్టు తెలుస్తుంది. ప్రేక్షకులను ఈ చిత్రం ఆఅకత్తుకున్తున్ధని చిత్ర బృందం భావిస్తుంది.