సమీక్ష : ఓడిన ‘యుద్ధం’

సమీక్ష : ఓడిన ‘యుద్ధం’

Published on Mar 15, 2014 2:00 AM IST
Yuddam-telugu విడుదల తేది : 14 మార్చి 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : భారతి గణేష్
నిర్మాత : నట్టి కుమార్
సంగీతం : చక్రి
నటినటులు : తరుణ్, యామి గౌతమ్

వరుస ఫ్లాప్స్ తో ఉన్న లవర్ బాయ్ తరుణ్, నట్టి కుమార్ నిర్మించిన ‘యుద్ధం’ తో తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నాడు. యామి గౌతమ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో శ్రీహరి కూడా ఉన్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్, ఈరోజు
రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా తరుణ్ కి విజయం అందిస్తుందో లేదో చూద్దాం.

కథ :
శంకర్ అన్న(శ్రీహరి), నిరంతరం పేదల కోసం పని చేసే ఓ మంచి మనిషి. తనకు సర్వస్వం తన సోదరి మధుమతి(యామి గౌతమ్).
రిషి(తరుణ్) ఒక్క విద్యార్థి నాయకుడు. అనుకోకుండా ఒక్క కాలేజీ సమస్య సందర్భంగా రిషి మధుమిత ప్రేమ లో పడిపోతాడు. మధుమితాకి కూడా రిషి అంటే ఇష్టం ఉంటుంది, కానీ తన ప్రేమను రిషికి చెప్పే సమయానికి, రిషి అన్న కూడా మధుమితని చూసి ఇష్టపడుతాడు.

వెంటనే ఇంటికి వెళ్లి రిషి అన్న, తను చుసిన అమ్మాయి గురించి ఇంట్లో చెబుతాడు. ఆ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని పట్టుబడుతాడు. రిషి మధుమితని త్యాగం చేస్తాడా? మధుమితని ఎలా ఒప్పిస్తాడు? రిషి శంకర్ అన్నను ఎలా ఎదురిస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే వెండితెర పై సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఎప్పటిలాగానే తరుణ్ అందంగా కనిపిస్తూ, తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు.
శ్రీహరి తన నటనతో ప్రేక్షకులను మేప్పించారు.

ఇంటర్వెల్ మరియు సెకండ్ హాఫ్ లోని మొదటి 15 నిముషాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయ్.

మైనస్ పాయింట్స్ :

మంచి పాత్ర అయినప్పటికీ, యామి గౌతమ్ తన పాత్రకు న్యాయం చేయలేకపోయింది. డాన్సులు కూడా తను సరిగ్గా చేయలేదు. తరుణ్, యామి మధ్య కెమిస్ట్రీ ఎ మాత్రం బాలేదు.

సినిమా మొదటి 15 నిముషాల వరకు ఏమి అర్ధంకాకుండా ఉంటుంది. సినిమాలో చాలా వరకు రొటీన్ సీన్స్ ఉంటాయి. శ్రీహరి పాత్ర కూడా, తను ఇదివరకు చేసిన పాత్రల లాగానే ఉంటుంది. వేణుమాధవ్, కృష్ణ భగవాన్ కామెడీ ప్రేక్షకులకు చాలా చిరాకు తెప్పిస్తాయి. సినిమా లో చాలా పాత్రలు అనవసరంగానే ఉంటాయి.

సాంకేతిక విభాగం :

కెమెరా వర్క్ చాలా బాగుంది. సినిమా లో పాటలు, వాటి చిత్రీకరణ బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరియు ఎడిటింగ్ పర్వాలేదనిపించేలా ఉన్నాయ్.

సినిమా స్క్రీన్ప్లే అస్సలు బాలేదు. అనవసర సన్నివేశాలతో సినిమాని లాగినట్టుగా ఉంటుంది.
డబ్బింగ్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మంచి కథ అయినప్పటికీ, డైరెక్టర్ భారతి గణేష్ కథ పై పట్టు కోల్పోయి తను అనుకున్న విధంగా తెర పై చూపించ్చలేకపోయాడు.

సినిమాలో ట్విస్ట్లు ఉన్నప్పటికీ, అవి కథకి ఎలాంటి న్యాయం చేయలేకపోయాయి.

తీర్పు :

చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న తరుణ్ కి ‘యుద్ధం’తో మళ్ళి ఒక్క ఫ్లాప్ పలుకరించ్చింది. రొటీన్ స్టొరీతో, అనవసరమైన కామెడీతో ప్రేక్షకులను మెప్పించడంలో ఈ సినిమా పూర్తిగా విఫలమైంది. ఆసక్తికరమైన విషయాలు ఏమి లేని ఈ సినిమాని చూడకుంటే ఎలాంటి నష్టం జరగదు.

123తెలుగు. కామ్ రేటింగ్ : 2/5
123తెలుగు టీం

తాజా వార్తలు