సమీక్షా: రాజ రాణి – మంచి ప్రేమకథ

Raja-Rani2 విడుదల తేది : 14 మార్చి 2014
123తెలుగు .కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : అట్లీ
నిర్మాత : మురుగుదాస్, ఫాక్స్ స్టార్ స్టూడియో
సంగీతం : జి వి ప్రకాష్ కుమార్
నటినటులు : ఆర్య, నయనతార

అట్లీ దర్శకత్వం లో వస్తున్న ‘రాజ రాణి’ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. ఫాక్స్ స్టార్ స్టూడియోతో కలిసి మురుగుదాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఆర్య హీరో గా నటించిన ఈ సినిమా లో నయనతార హీరోయిన్. తమిళ్ లో విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో ఎలా ఉందో చూద్దాం.

కథ :

జేమ్స్ (ఆర్య) మరియు రెజినా(నయనతార) ఒక్కరిక్కొకరు ఇష్టం లేకున్నప్పటికీ, తమ తల్లితండ్రుల కొసం పెళ్లి చేసుకుంటారు. జేమ్స్ ఒక్క తాగుబోతు, అతను రోజు ఇంటికి లేట్ గా వస్తుంటాడు. భార్యాభర్తలు ఇద్దరు రోజు కొట్టుకుంటూనే ఉంటారు. ఒక్కరి ఫోన్ నెంబర్ ఒక్కరికి తెలిదు.

ఒక్క రోజు రెజినాకు ఫిట్స్ వచ్చి హాస్పిటల్ లో చేరుతుంది. డాక్టర్ జేమ్స్ ని తన భార్య ఆరోగ్యానికి సంభందించిన వివరాలు అడుగుతాడు. కానీ అతనికి తన భార్య గురించి ఏమి తెలియకపోవడంతో, అప్పటి నుండి తను రెజినాతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు.

వివాహానికి ముందు రెజినాకు ఓ విషాద ప్రేమకథ ఉన్నట్టు జేమ్స్ కి తెలిసి, రెజినా పై గౌరవం ప్రేమ పెంచుకుంటాడు. అదే సమయంలో, రెజినాకి కూడా పెళ్లికి ముందు జేమ్స్ ప్రేమ వ్యవహారం, ప్రేమ లో అతను విఫలం అయిన సంగతి తెలిసి అతని పై గౌరవం పెరుగుతుంది.

ఇదే సమయం లో రెజినాకు ఆస్ట్రేలియా వెళ్ళే అవకాశం వస్తుంది. రెజినా ఆస్ట్రేలియా వెళ్తుంద లేదా అనేది మాత్రం తెర పై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఆర్య నటన చాలా బాగుంది. జై కాల్ సెంటర్ లో పనిచేసే క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. నయనతార, చీరకట్టు లో చాలా అందంగా ఉంది. నయనతార జై కలిసి ఉన్న సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి.

సెకండ్ హాఫ్ లో నజరియ ఒక్క ముఖ్య పాత్ర లో నటించింది. తన నటనతో అందర్ని అక్కట్టుకుంటుంది. కమెడియన్ సంతానం తన కామెడీ తో అలరించాడు. నయనతార తండ్రి గా సత్యరాజ్ నటన బాగుంది.

సినిమా లోను ఉద్వేగపూరితమైన సన్నివేశాలు చాల బాగా ఉన్నాయ్. ఆర్య నయనతారను తన ఫోన్ నెంబర్ అడిగే సన్నివేశం అలాగే క్లైమాక్స్ సన్నివేశాలుచాల బాగా వచాయి.

ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రెండు ప్రేమ కథలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాయి. ఈ రెండు ప్రేమ కథలలో యువకులు తమను తాము చూసుకుంటారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాని దెబ్బతీసేలా అక్కడక్కడా కొన్ని డల్ మూమెంట్స్ ఉన్నాయ్. నయనతార మినహా ఎవ్వరు తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవడం కూడా సినిమాకి కొంత మేరకు నష్టం కలిగించొచ్చు. సినిమా లోని పాటలు ప్రేక్షకులని అక్కట్టుకోలేకపోతునాయి. వినోదం చాలా తక్కువ ఉన్న ఈ సినిమా చుసిన సినిమా లానే అనిపిస్తుంటుంది.
క్యాబిన్ క్రూ ట్రైనింగ్ కి వెళ్ళిన జై తరువాత కస్టమ్స్ అధికారిలా కనిపిస్తాడు, ఇలా ఎందుకు జరిగిందో దర్శకుడికే తెలియాలి.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రాఫి చాలా బాగుంది. ఎడిటింగ్ మాత్రం సంతృప్తి పరిచేలా లేదు. అనవసరమైన సన్నివేశాలు చాలా ఉన్నాయ్. అనువాద చిత్రం అయిన్నప్పటికీ డైలాగ్స్ చాలా బాగున్నాయి. తొలిసారి దర్శకత్వం వహిస్తున్నప్పటికి, డైరెక్టర్ అట్లీ మంచి ప్రతిభ చూపించాడు.

తీర్పు :

కొన్ని బోరింగ్ సన్నివేశాలు మినహా ఇది ఓ మంచి లవ్ స్టొరీ. రాజ రాణి మల్టీప్లెక్స్ ప్రేక్షకులని మాత్రమే అలరించగలదు. మంచి నటన,
ఉద్వేగపూరితమైన సన్నివేశాలు, ప్రేక్షకులు మెచ్చే ప్రేమ కథ, వీటన్నిటి కోసం ఈ సినిమాని చూడవచ్చు.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

Exit mobile version