విడుదల తేదీ : సెప్టెంబర్ 12, 2025
స్ట్రీమింగ్ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : తమన్నా భాటియా, డయానా పెంటీ, నకుల్ మెహతా, జావేద్ జాఫ్రీ, నీరజ్ కబి, శ్వేతా తివారీ తదితరులు
దర్శకుడు : అర్చిత్ కుమార్ – కాలిన్
నిర్మాతలు : కరణ్ జోహర్, అపూర్వ మెహతా, అదర్ పూనావాలా
సంగీతం : సంగీత్-సిద్ధార్థ్
సినిమాటోగ్రఫీ : అనుభవ్ బన్సాల్
ఎడిటింగ్ : అమిత్ కుల్కర్ణి
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ బ్యూటీ డయానా పెంటీ లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘డు యూ వాన్నా పార్ట్‌నర్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 12న స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
సిఖా రాయ్(తమన్నా), అనహిత(డయానా పెంటి) తమ ఉద్యోగాలు మానేసి సొంతంగా ఎదగాలని చూస్తారు. ఈ క్రమంలో సిఖా తన తండ్రికి ఎంతో ఇష్టమైన బీరు తయారి విధానాన్ని బిజినెస్‌గా చేయాలని భావిస్తుంది. ఈ క్రమంలో అనహితతో కలిసి బీర్ తయారు చేసే కంపెనీని స్థాపిస్తుంది. ఈ క్రమంలో వారికి తోడుగా బాబీ(నకుల్ మెహతా), డేవిడ్ జోన్స్(జావేద్ జాఫ్రీ) సహాయపడతారు. అయితే, వారి జీవితంలో విక్రమ్ వాలియా, లైలా సింగ్ వంటి వారు ప్రవేశిస్తారు. ఇంతకీ వీరు సిఖా, అనహిత లతో ఎందుకు తారసపడ్డారు..? వీరితో వారికి ఎలాంటి సంబంధం ఉంటుంది..? సిఖా-అనహిత బిజినెస్‌లో ఎలాంటి అవరోధాలు వస్తాయి..? అవి వారి మధ్య ఎలాంటి విభేదాలు తెస్తాయి..? చివరకు ఏం జరిగింది..? అనేది ఈ వెబ్ సిరీస్ కథ.
ప్లస్ పాయింట్స్ :
వుమెన్ ఎంపవర్‌మెంట్ గురించి ప్రసంగాలు చాలానే చూసుంటాం. ఈ వెబ్ సిరీస్ లో అది మనకు కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణించేందుకు ఆసక్తితో పాటు ఎంత కష్టపడతారు అనేది మనకు ఈ సిరీస్‌లో కనిపిస్తుంది. సిఖా తన తండ్రి చేయలేకపోయిన పనిని తన స్నేహితురాలు అనహిత తో కలిసి ఎలాగైనా చేసేందుకు వేసే ప్రణాళికలు.. చేసే ప్రయత్నాలు బాగున్నాయి. మగవారు మాత్రమే చేయగలిగే బీర్ తయారీ బిజినెస్‌ను ఆడవారు కూడా చేయగలరనే అంశాన్ని మనకు ఇందులో చూపెట్టారు.
తమన్నా, డయానా పెంటీలు తమ పర్ఫార్మెన్స్‌లతో ఈ వెబ్ సిరీస్‌ను క్యారీ చేసిన విధానం బాగుంది. ఇక ఈ సిరీస్‌లో మరో ముఖ్యమైన పాత్రగా జావేద్ జాఫ్రీ నిలిచాడు. ఆయన స్క్రీన్‌పై కనిపించినంత సేపు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. మిగతా క్యాస్టింగ్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది.
కథలో మంచి పాయింట్ ఉంది. ఇది సరిగ్గా ఎగ్జిక్యూట్ అయి ఉంటే ప్రేక్షకులకు ఓ మంచి వెబ్ సిరీస్ చూసామనే ఫీలింగ్ ఉండేది. ఇక ఈ వెబ్ సిరీస్‌కు బ్యాక్‌గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కథకు అనుగుణంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
నేటి జనరేషన్‌కు సరిపోయే కథ ఇందులో ఉన్నప్పటికీ, అది ప్రేక్షకులకు కనెక్ట్ కాదు. ఏదో పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమా చూస్తున్న భావన ప్రేక్షకులకు కలుగుతుంది. దానికి కారణం ఈ సిరీస్‌లో కొత్తదనం లేకపోవడం. స్త్రీలు ఏం చేయాలనుకున్నా చేస్తారు.. అనే చిన్న పాయింట్‌ను పట్టుకుని, దర్శకులు ఇంత కథ నడిపించారే.. అని సగటు ఆడియన్స్ ఫీల్ అవుతారు.
ఇక ఈ వెబ్ సిరీస్‌కు మరో మేజర్ మైనస్ పాయింట్ దీని నెరేషన్. కథలో చాలా నెమ్మదితనం.. అనవసరమైన ల్యాగ్ సీన్స్.. ఎన్నో మనకు ఇందులో కనిపిస్తాయి. ఇవి ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి.
నటీనటుల పరంగా లీడ్ రోల్స్ తో పాటు మరికొన్ని పాత్రలు పర్వాలేదనిపించాయి. అయితే కేమియో పాత్రలు, మరికొన్ని పాత్రల నిడివి పెంచి ఉంటే బాగుండేది. చాలా మంది స్టార్స్ ఉన్నా, వారికి పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడలేదు అని ఈ వెబ్ సిరీస్ చూస్తే అర్థమవుతుంది.
సాంకేతిక విభాగం :
దర్శకులు అర్చిత్ కుమార్ – కాలిన్ ఈ వెబ్ సిరీస్‌ను ఎగ్జిక్యూట్ చేసిన విధానం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. రొటీన్ కథ అయినా, ఎగ్జిక్యూషన్ బాగుండి ఉంటే, ఈ సిరీస్ రిజల్ట్ వేరేలా ఉండేది. మంచి క్యాస్టింగ్‌ను కూడా వారు వినియోగించుకోలేకపోయారు. సంగీతం పరంగా బాక్‌గ్రౌండ్‌లో వచ్చే సాంగ్స్, ట్యూన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్‌గా ఉండాల్సింది చాలా సీన్స్ ను ట్రిమ్ చేసి ఉంటే బెటర్‌గా అనిపించేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే, ‘డు యూ వాన్నా పార్ట్‌నర్’ వెబ్ సిరీస్ ఓ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను కొంతవరకు మాత్రమే మెప్పిస్తుంది. తమన్నా, డయానా పెంటి తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకుంటారు. కథలో దమ్ము లేకపోవడం.. దాన్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయకపోవడం, స్లోగా సాగే చాలా సీన్స్ ప్రేక్షకులను మెప్పించవు. కామెడీ డ్రామాలను ఇష్టపడేవారు ఈ వెబ్ సిరీస్‌ను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team